సంక్రాంతి పోటీలో దారుణం. ధీరజ్ ని పొడిచేసిన రౌడీ!
on Jan 26, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -65 లో..... ధీరజ్, ప్రేమ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం తెల్సి.. వాళ్ళ కాలేజీ ఫ్రెండ్స్ గుడిలో కలిసి ఆటపట్టిస్తారు. ఇలా చెయ్యండి ఆలా చేయండి అంటూ ఉంటే.. ప్రేమ, ధీరజ్ లకి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఏంటి ఇలా చేస్తున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. అప్పుడే తిరుపతి వచ్చి ఏంటి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అలా బిహేవ్ చేస్తున్నారని అనుకుంటున్నారా.. చిరాకు, చిలిపి, తగాధాలు ఉన్నచోటే ప్రేమ ఉంటుందని తిరుపతి వాళ్ళతో చెప్తాడు.
అదంతా చూసిన కామాక్షి వీళ్ళ పెళ్లి వెనకాల ఏదో స్కామ్ వుంది అదేంటో కనిపెట్టాలని అనుకుంటుంది. మరొకవైపు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు నన్ను దూరం పెడుతున్నావ్.. శోభనం రోజు నీకు తలనొప్పి లేవలేదు.. నీకు నేను అంటే ఇష్టం లేదని సాగర్ అంటుంటే.. అలా అనకు సాగర్ మా వాళ్ళని వదులుకొని నీ దగ్గరికి వచ్చానని నర్మద అంటుంది. నీకు కారణం చెప్పకూడదనుకున్న కానీ చెప్తానంటూ రామరాజు, వేదవతి లు చందు గురించి మాట్లాడుకున్న విషయం సాగర్ కి చెప్తుంది. బావ గారి గురించి అలోచించి ఇలా చేస్తున్నానని అనగానే.. నర్మదని సాగర్ హగ్ చేసుకుంటాడు. నా కుటుంబం గురించి ఇంత ఆలోచిస్తున్నావని సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ధీరజ్ ఫోన్ మాట్లాడుతుంటే రామరాజు అక్కడ పక్కన ఒకతన్ని పిలుస్తాడు. ధీరజ్ తనను అనుకోని దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కానీ రామరాజు మాట్లాడడు. ఆ తర్వాత సంక్రాతికి కొన్ని పోటీలు పెడతారు. భార్యని ఎత్తుకొని భర్త పరిగెత్తాలిమ అందులో విన్ అయిన వారికి బహుమతి అంటారు. దాంతో ధీరజ్, ప్రేమలని, సాగర్ నర్మదలని పోటీలోకి పంపిస్తుంది కామాక్షి. తరువాయి భాగంలో ఒక రౌడీ వచ్చి ధీరజ్ ని కత్తితో పొడుస్తాడు. ధీరజ్ నాన్న అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
